హీరోలందరికీ నచ్చే హీరోను నేను: అడివి శేష్
Add ap7am to your home Screen

హీరోలందరికీ నచ్చే హీరోను నేను: అడివి శేష్

HIT Movie Update
  • అడివి శేష్ హీరోగా రూపొందిన 'హిట్ 2'
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • దర్శకత్వం వహించిన శైలేశ్ కొలను 
  • కొంతసేపటి క్రితం రిలీజ్ అయిన టీజర్ 
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల   
హీరో నాని నిర్మించిన 'హిట్ 2' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంటులో అడివి శేష్ మాట్లాడాడు.

"ఈ స్టేజ్ పై ఒక్కసారిగా నా జర్నీ గుర్తుకు వచ్చింది. హీరోలంతా ఇష్టపడే హీరోను నేను. నేను 'క్షణం' సినిమా చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందుగానే బన్నీ స్పందించాడు .. పెద్ద లెటర్ రాసి పెట్టాడు. ఆ సమయంలో ఆయన అందించిన సపోర్టును ఎప్పటికీ మరిచిపోలేనిది. ఇక ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్న థియేటర్ మహేశ్ బాబుగారిది. ఆయన 'క్షణం' టీజర్ లాంచ్ చేయడమే కాదు .. నాతో 'మేజర్' సినిమాను నిర్మించారు" అన్నాడు. 

"ఇక నేను అభిమానించే హీరో నాని. నా 'గూఢచారి' ట్రైలర్ ను .. 'ఎవరు' ట్రైలర్ ను తనే లాంచ్ చేశారు. ఇక ట్రైలర్స్ లాంచ్ చేయడం కాదు .. నీతో ఒక సినిమానే చేస్తాను అంటూ 'హిట్ 2' సినిమాను నిర్మించారు. అలా హీరోలందరి సపోర్టు .. ఒక మంచి సినిమా చేయాలనే తపనే నన్ను ఇంతదూరం తీసుకుని వచ్చాయి. మీనాక్షి నటన ఆకట్టుకుంటుంది .. కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు..
Adivi Sesh
Meenakshi Choudary
HIT 2 Movie

More Telugu News