మునుగోడులో కారు ఆపి టీఆర్ఎస్ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన బండి సంజయ్
- మునుగోడు ఎన్నికల్లో జోరుగా సాగుతున్న ప్రచారం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల ఆసక్తి
- కారు ఆపి టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడిన సంజయ్
మునుగోడు పోలింగ్ కు సమయం దగ్గరపడుతన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలంతా మునుగోడులోనే తిష్ఠ వేశారు. ఈ క్రమంలో శుక్రవారం మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళుతున్న బండి సంజయ్ కనిపించగానే... టీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు ఆయన కారు వద్దకు వెళ్లే యత్నం చేశారు. ఇది గమనించిన సంజయ్ తన కారును ఆపి...వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలైనప్పటికీ వారితో ఆత్మీయంగా కరచాలనం చేశారు.