Chiranjeevi: చిరంజీవి 154వ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఖరారు

Chiranjeevi 154th movie title will be announced in Diwali
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళి సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ దీపావళికి మనం 'మాస్ మూలవిరాట్' కు స్వాగతం పలుకుదాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. "బాస్ వస్తున్నాడు... పూనకాలు లోడింగ్" అంటూ మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తించేలా ట్వీట్ చేసింది. 

కాగా ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇదే ఖరారవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
154
Title
Valter Veerayya
Bobby
Tollywood

More Telugu News