Chiranjeevi: చిరంజీవి కొత్త చిత్రం డబ్బింగ్ పనులు షురూ

Chiranjeevi new movie dubbing work starts
షార్ట్స్‌లో చూడండి
గాడ్ ఫాదర్ చిత్రం అందించిన ఘనవిజయంతో మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్నారు. ఇది చిరంజీవికి 154వ సినిమా. కాగా, ఈ సినిమా డబ్బింగ్ పనులు నేడు ప్రారంభం అయ్యాయి. 

దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని తెలిపింది. బహుశా అది టైటిల్ కన్ఫర్మేషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దీపావళి నాడు వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. 

ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అనే రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో వాల్తేరు వీరయ్య అనే పేరును చిరంజీవి సూచించారు. మరి వీటిలో దేనిని చిత్రబృందం ఫిక్స్ చేస్తుందో చూడాలి. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
New Movie
Dubbing
Bobby
Tollywood

More Telugu News