ఇది చిరంజీవి, తమన్, మోహన్ రాజాల కష్టానికి దక్కిన ఫలితం: ఎన్వీ ప్రసాద్
- ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయన్న నిర్మాత ఎన్వీ ప్రసాద్
- తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్ల షేర్ రాబట్టిందని వెల్లడి
- హిందీలో రూ. 10 కోట్లు వసూలు చేసిందన్న ఎన్వీ ప్రసాద్
తాము ఊహించిన దాని కంటే కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్ల వరకు షేర్ రాబట్టిందని చెప్పారు. ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి ఆదరణ లభించిందని... అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నామని తెలిపారు. హిందీలో సైతం ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోందని... తొలి వారంలో రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టిందని... ఇది మామూలు విషయం కాదని అన్నారు.