బండి సంజయ్.. భూతవైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది: హరీశ్ రావు
- క్షుద్రపూజలు, మంత్రతంత్రాల పేరుతో విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టింది బీజేపీయేనని విమర్శించిన తెలంగాణ మంత్రి
- మునుగోడులో బీజేపీ కార్లు, బైకులు పంచి గెలవాలని చూస్తోందని ఆరోపణ
మునుగోడులో కార్లు, బైకులు పంచే ప్రయత్నం
మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఓట్ల కోసం డబ్బులు పంచడమేగాకుండా 2 వేల కార్లు, 2 వేల బైకులు కొనిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను సైతం ప్రలోభ పెడుతున్నారన్నారు. బైకులు, కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీస్తున్నామని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.