ఎన్టీఆర్, కొరటాల చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్!
- ఈ చిత్రంలో నటించడంపై స్పందించిన స్టార్ హీరోయిన్
- బాలీవుడ్‌లో రష్మిక తొలి చిత్రం గుడ్‌బై విడుదల
- అందులో తార పాత్రకు మంచి స్పందన
తొలుత ఆలియా భట్ ను అనుకున్నారు. కానీ, ఆమె తొందర్లోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. తర్వాత జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. అదే సమయంలో రష్మిక పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయంపై రష్మిక స్పందించింది. ఎన్టీఆర్‌తో సినిమాలో నటిస్తున్నారా?అని అడిగితే.. ‘అప్పుడే ఎలా తెలిసింది.. ఇంకా అఫీషియల్‌గా కూడా చెప్పలేదు’ అని చెప్పిందామె. ఇందులో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. దాంతో, ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్ అని దాదాపు స్పష్టం అయిపోయింది. ప్రస్తుతం రష్మిక ఖాతాలో పలు చిత్రాలు ఉన్నాయి. హిందీలో ‘మిషన్ మజ్ను’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ‘యానిమల్’లో నటిస్తోంది. తెలుగులో వారసుడు, పుష్ప 2 చిత్రాలు చేస్తోంది.