బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత
- అనారోగ్యంతో చనిపోయిన అరుణ్ బాలి
- కొన్నాళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న అరుణ్
- సినిమా, సీరియల్స్ లో నటించి మెప్పించిన బాలి
అరుణ్ బాలి.. త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పానిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్‌వాలా గుండా, ఫూల్ ఔర్ అంగార్, రామ్ జానే వంటి అనేక ఇతర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయా పాత్రలకు న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ లోనూ పని చేశారు. అరుణ్ బాలి నిర్మాతగా పలు చిత్రాలను కూడా రూపొందించారు. నిర్మాతగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.