Jaspreet Bumrah: టీ20 వరల్డ్ కప్ కు దూరం కావడంపై బుమ్రా స్పందన

Bumrah reaction on ruled out from T20 World Cup
  • వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రా
  • బుమ్రా టీ20 వరల్డ్ లో ఆడడంలేదన్న బీసీసీఐ
  • మెగా టోర్నీలో ఆడలేకపోవడం బాధగా ఉందన్న బుమ్రా
  • టీమిండియాకు తన ప్రోత్సాహం ఉంటుందని వెల్లడి
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీపుగాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. దీనిపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 

ఈసారి టీ20 వరల్డ్ కప్ లో తాను ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు. ఈ సమయంలో తాను కోలుకోవాలంటూ సందేశాలు పంపిస్తూ, మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. తాను కోలుకుంటున్నానని, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని బుమ్రా వివరించాడు. 

గత కొన్నిరోజులుగా వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రమైనదేనని వెల్లడైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమైన బుమ్రా... గాయం తీవ్రత దృష్ట్యా టీ20 వరల్డ్ కప్ కు కూడా అందుబాటులో లేకుండాపోయాడు.

More Telugu News

Jaspreet Bumrah
T20 World Cup
Team India
Injury