సీఎం సొంత జిల్లాను మాఫియా కేంద్రంగా మార్చేశారు: టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి
- వైసీపీ నేతలు మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్న శ్రీనివాసులు రెడ్డి
- టీడీపీ ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని వ్యాఖ్య
- అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని విమర్శ
కడప శివార్లలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై టీడీపీ ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. చలమారెడ్డి పల్లెలో ఎంత మేర మట్టిని తోడేశారో మైనింగ్ అధికారులు సర్వే చేయలేదని అన్నారు. తూతూ మంత్రంగా సర్వే చేసి రూ. 2 కోట్లు పెనాల్టీ వేశారని... పక్కాగా సర్వే చేస్తే రూ. 10 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టినట్టు తేలుతుందని చెప్పారు. వైసీపీ నేతలు ఆదాయానికి గండి కొడుతుంటే... మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.