ఇండియా బయలుదేరిన ఆస్ట్రేలియా జట్టు.. ఈ నెల 20 నుంచి టీ20 సీరిస్
- 3 మ్యాచ్‌లతో కూడిన టీ20 సీరిస్
- ఇరు జట్లను ప్రకటించిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు
- భారత్ బయలుదేరినట్లు వెల్లడించిన పాట్ కమ్మిన్స్
ఈ సీరిస్ కోసం ఇప్పటికే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అటువైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఈ సీరిస్ కోసం జట్టును ప్రకటించగా... ఆ జట్టు సభ్యులు గురువారం భారత్ బయలుదేరారు. ఈ సందర్భంగా భారత్‌కు బయలుదేరిన విమానంలో తన ఫొటోను సెల్ఫీ తీసిన ఆసీస్ జట్టు ఆటగాడు పాట్ కమ్మిన్స్... తాము భారత్ బయలుదేరామంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.