టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు: రోజా

Whats wrong in Kodali Nani language asks Roja
  • నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదన్న రోజా
  • జగన్ పై నారా లోకేశ్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపాటు
  • కొడాలి నాని భాషలో తప్పేముందని ప్రశ్న
ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్యోగాల కల్పన విషయంలో ఆందోళన చేయడంతో సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

ఈ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ... నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి టీడీపీ నేతలకు లేదని... వారికి రాజకీయాలే ముఖ్యమని అన్నారు.  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన డీఎస్సీని కూడా జగనే ఇచ్చారని రోజా అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా 10,143 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. 

మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము టీడీపీకి ఉందా? అని రోజా అన్నారు. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన నారా లోకేశ్ సీఎం జగన్ పై అవాకులు, చెవాకులు పేలుతున్నారని... తీరు మార్చుకోకపోతే ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని హెచ్చరించారు. కొడాలి నాని భాషలో తప్పేముందని ప్రశ్నించారు. కొడాలి నానిపై ఈగ వాలినా సహించబోమని అన్నారు. టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Roja
Jagan
YSRCP
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News