చేతికి క‌ట్టుతో జ‌న సైనికుల విరాళాన్ని స్వీక‌రించిన నాగ‌బాబు.. ఫొటో ఇదిగో
Add ap7am to your home Screen

చేతికి క‌ట్టుతో జ‌న సైనికుల విరాళాన్ని స్వీక‌రించిన నాగ‌బాబు.. ఫొటో ఇదిగో

janasena pac member nagababu recieves cheque from jana sena cadre with a bandage on his hand
  • నా సేన కోసం... నా వంతు.. పేరిట విరాళాల‌కు పిలుపు నిచ్చిన జ‌న‌సేన‌
  • రూ.4 ల‌క్ష‌ల విరాళాన్ని అంద‌జేసిన నెల్లిమ‌ర్ల జ‌న సైనికులు
  • విరాళం సేక‌రిస్తున్న సంద‌ర్భంగా చేతికి క‌ట్టుతో క‌నిపించిన నాగ‌బాబు
నా సేన కోసం.. నా వంతు.. పేరిట జ‌న‌సేన చేప‌ట్టిన పిలుపున‌కు జ‌న సైనికుల నుంచి భారీ స్పంద‌నే ల‌భిస్తోంది. చిన్న మొత్తాల నుంచి ల‌క్ష‌ల మేర విరాళాలు ఆ పార్టీకి అందుతున్నాయి. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన జ‌న సైనికులు రూ.4 ల‌క్ష‌ల విరాళాన్ని మంగ‌ళ‌వారం పార్టీకి అంద‌జేశారు.

ఈ విరాళాన్ని పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) స‌భ్యుడు నాగ‌బాబు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా కుడి చేతికి క‌ట్టుతో ఆయ‌న క‌నిపించారు. చేతికి కట్టుతోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న జ‌న సైనికుల నుంచి విరాళానికి చెందిన చెక్కును అందుకున్నారు. అయితే, ఏ కార‌ణంగా ఆయ‌న చేతికి క‌ట్టు క‌ట్టుకున్నార‌న్న విష‌యం వెల్ల‌డి కాలేదు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠత కోసం సమైక్యంగా శ్రమించాల‌ని ఆయ‌న జ‌న సైనికుల‌కు సూచించారు.
Janasena
Andhra Pradesh
Vijayanagaram District
Nellimarla
Nagababu

More Telugu News