Geetha Sakshiga: ఆసక్తి కలిగిస్తున్న 'గీత సాక్షిగా' ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్

First and second look posters from Geetha Sakshiga
షార్ట్స్‌లో చూడండి
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించిన సబ్జెక్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'గీత సాక్షిగా'. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుండగా, తాజా పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తుండడం అదనపు ఆకర్షణ. 

ఈ చిత్రంలో  భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిత్ర నిర్మాత చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందించడం విశేషం. కాగా, పోస్టర్ పై 'నిజ జీవిత సంఘటనల ఆధారంగా'  అనే క్యాప్షన్‌ ఉండడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Go Back to Shorts
Geetha Sakshiga
First Look
Second Look
Posters
Tollywood

More Telugu News