సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు
- పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అంటూ ప్రెస్ నోట్ వైరల్
- ఫిల్మ్ ఛాంబర్ పేరుతో వైరల్ అయిన ప్రెస్ నోట్‌పై స్పందించిన సురేష్ బాబు
- అది ఫేక్ నోట్ అని, తాము అధికారికంగా జారీ చేయలేదని వెల్లడి
- సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఛాంబర్
- 'పెద్ది' సినిమా ప్రదర్శనపై ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టీకరణ
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పేరుతో 'పెద్ది' సినిమా విడుదలపై సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెస్ నోట్‌పై అధ్యక్షుడు, నిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు. ఆ ప్రెస్ నోట్ ఫేక్ అని, ఛాంబర్ నుంచి తాము అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
'పెద్ది' సినిమా ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు అందరూ ఆమోదం తెలిపారని, ఆ చిత్రానికి లైన్ క్లియర్ అయిందంటూ ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, దీనిపై స్పందించిన సురేష్ బాబు, ఆ నోట్‌తో ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానంపై ఛాంబర్ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.
కొంతకాలంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలో సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో అద్దె, పర్సంటేజీ విధానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. 'పెద్ది' చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొందరు ఎగ్జిబిటర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ వాడివేడి చర్చల అనంతరం, సురేష్ బాబు సంతకం లేకుండా ఈ ఫేక్ ప్రెస్ నోట్ బయటకు రావడం గమనార్హం.
మొత్తంగా, 'పెద్ది' చిత్ర విడుదలపై ఎలాంటి అడ్డంకులు లేవని వచ్చిన వార్తలు అవాస్తవమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న ఫేక్ ప్రెస్ నోట్ ఇదే...