తెలంగాణలో కొత్తగా 128 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 11,398 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 54 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 177 మంది
  • ఇంకా 933 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 11,398 కరోనా పరీక్షలు నిర్వహించగా, 128 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 54, రంగారెడ్డి జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 357 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 177 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,35,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,703 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 933 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
Daily Report
New Cases

More Telugu News