తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి
- పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- హైదరాబాద్లోని కాప్రాలో నిన్న అత్యధిక వర్షపాతం నమోదు
కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వివరించింది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, నిన్న హైదరాబాద్లోని కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అత్యల్పంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.