స్పీకర్ పోచారం తీరుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్
- రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న సంజయ్
- స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- బీజేపీ అంటేనే కేసీఆర్ వణికిపోతున్నారని ఎద్దేవా
అసెంబ్లీలో కుదరకపోతే ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. స్పీకర్ వ్యవహారశైలిపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు. స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో కొత్తగా నియమితులైన పార్లమెంటు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇన్ఛార్జీలతో ఈరోజు బండి సంజయ్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.