తెలంగాణలో తాజాగా 141 మందికి కరోనా పాజిటివ్

Telangana corona report
  • గత 24 గంటల్లో 11,632 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 59 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 190 మంది
  • ఇంకా 1,004 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 11,632 కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 59, రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఇంకా 387 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,35,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,222 మంది కోలుకున్నారు. ఇంకా 1,004 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
New Cases

More Telugu News