తక్కువ ధరకే రియల్ మీ సీ33 విడుదల
- 3జీ, 32జీబీ వేరియంట్ ధర రూ.8,999
- 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.9,999
- ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డుపై రూ.1,000 తగ్గింపు
- ఈ నెల 12న ఫ్లిప్ కార్ట్ పై విక్రయాలు
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ ఫోన్ 8.3 ఎంఎం మందంతో, 187 గ్రాముల బరువు ఉంటుంది. 3జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.8.999. 4జీబీ ర్యామ్ ధర రూ.9,999. ఆక్వా బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ పై విక్రయాలు జరగనున్నాయి. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.