ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం వల్లే బీజేపీ సంఖ్య పెరిగింది.. అమిత్ షాపై సీపీఎం ఫైర్
- కేరళలో వచ్చే ఎన్నికల్లో కమలం వికసిస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలపై విమర్శ
- కేరళలో గతంలో ఉన్న ఒక్క కమలం కూడా వాడిపోయిందని ఎద్దేవా
- అమిత్ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్య
ఆ ఒక్కటీ వాడిపోయింది..
2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల సాయంతో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుందని ఎంఏ బేబీ గుర్తు చేశారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో ఆ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పారు. గతంలో కేరళలో వికసించిన ఒక్క కమలం కూడా కుళ్లిపోయిందని, ఈ విషయం అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేరళలో బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే.. కమలం వికసిస్తుందంటూ అమిత్ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు.