తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 18,571 కరోనా పరీక్షలు
- 255 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 95 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 357 మంది
- ఇంకా 2,154 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,33,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,511 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,154 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
