గిరిజన నృత్యాల్లో తెలంగాణ మహిళా మంత్రి... ఇవిగో ఫొటోలు
- వేడుకగా జరిగిన తీజ్ ఉత్సవాలు
- కల్వకుర్తి మండలంలో ఉత్సవాలకు హాజరైన సత్యవతి రాథోడ్
- గిరిజనంతో కలిసి ఆడిపాడిన మహిళా మంత్రి
గిరిజనులు ఉత్సాహంగా జరుపుకునే తీజ్ ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జయప్రకాష్ నగర్ తండాలో గిరిజనులు వేడుకగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన సత్యవతి రాథోడ్.. గిరిజనులతో కలిసి ఆడి పాడారు. గిరిజన సంప్రదాయ వస్త్రాన్ని తలపై చుట్టుకుని ఆమె ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.