ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలలో దేశంలోనే టాప్ లేపిన తెలంగాణ!
- తెలంగాణలో మొత్తం 12,769 గ్రామాలు
- రాష్ట్రంలో ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మల విసర్జన రహిత) గ్రామాలుగా 12,766
- 99.98 శాతంతో టాప్లో నిలిచిన తెలంగాణ
రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండగా... వాటిలో 12,766 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తింపు సంపాదించాయి. ఓడీఎఫ్ లేని గ్రామాలుగా తెలంగాణలో కేవలం మూడంటే మూడు గ్రామాలు మాత్రమే మిగిలాయి. వెరసి ఓడీఎఫ్ సాధనలో తెలంగాణ రాష్ట్రం 99.98 శాతం ఫలితాలను రాబట్టినట్టయింది.