ఆరేళ్ల శిక్షను పై కోర్టులో సవాలు చేసిన సౌదీ మహిళ.. షాక్ ఇస్తూ 34 ఏళ్ల శిక్షను ఖరారు చేసిన పైకోర్టు!
Add ap7am to your home Screen

ఆరేళ్ల శిక్షను పై కోర్టులో సవాలు చేసిన సౌదీ మహిళ.. షాక్ ఇస్తూ 34 ఏళ్ల శిక్షను ఖరారు చేసిన పైకోర్టు!

Saudi woman sentenced to 34 years in prison
  • లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న బాధితురాలు
  • సౌదీ అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్లు చేశారని అభియోగాలు
  • సౌదీలో అడుగుపెట్టగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు
సౌదీ అరేబియాలో నేరాలకు శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు అమలు చేస్తూ నేరాలను కట్టడి చేస్తోంది సౌదీ అరేబియా. తాజాగా ఓ మహిళకు విధించిన శిక్ష గురించి తెలిసిన ప్రపంచం నివ్వెరపోయింది. 

వదంతులను ట్వీట్ చేశారన్న అభియోగాలపై అక్కడి కోర్టు ఆమెకు ఏకంగా 34 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాధితురాలి పేరు సల్మా అల్ షెబాజ్. అక్కడి మైనారిటీ వర్గమైన షియా ముస్లిం వర్గానికి చెందిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న సల్మా గతేడాది జనవరిలో సెలవులకు సౌదీ వచ్చారు. దేశంలో ఆమె అడుగుపెట్టగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సౌదీలోని అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్ చేసిన అభియోగాలపై ఆమెను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సల్మాకు తొలుత ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ తీర్పును సల్మా పైకోర్టులో సవాలు చేశారు. అయితే, అక్కడామెకు చేదు అనుభవం ఎదురైంది. పై కోర్టు ఆమెకు ఏకంగా 34 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Saudi Arabia
Tweets
Leeds University

More Telugu News