తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు... ఐఎండీ వెల్లడి
- చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
- గత కొన్నివారాలుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు
- ఈ నెల 25 తర్వాత వర్షాలు తగ్గుముఖం
- నేడు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో గత కొన్నివారాలుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో జలాశయాలు, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం వరుణుడి ప్రభావంతో అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి.