ఈడీ విచారణలకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత అన్నీ మోదీనే: కేవీపీ రామచంద్రరావు
- ఈడీని కేంద్రం ఒక ఆయుధంగా వాడుతోందన్న కేవీపీ
- ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని వ్యాఖ్య
- గాంధీ, నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనుకుంటున్నారని విమర్శలు
గాంధీ, నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోందని... ఇది వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందని కేవీపీ చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల గాంధీ, నెహ్రూ కుటుంబాలకు ఇమేజ్ పెరుగుతుందే తప్ప, ఎలాంటి డ్యామేజ్ జరగదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తొలి రోజు ఈడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. 3 గంటల పాటు అధికారులు ఆమెను విచారించారు. ఈ నెల 25న మళ్లీ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.