ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వైర‌ల్ ఫీవ‌ర్‌... 24న జ‌న‌వాణి ర‌ద్దు
Add ap7am to your home Screen

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వైర‌ల్ ఫీవ‌ర్‌... 24న జ‌న‌వాణి ర‌ద్దు

pawan kalyan suffers viral fever and janavani cancelled on 24th of this month
  • ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న త‌ర్వాత ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌
  • ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన నేత‌లు, ప‌వ‌న్ సెక్యూరిటీ గార్డుల‌కూ వైర‌ల్ ఫీవ‌ర్‌
  • ఈ నెల 31న త‌దుప‌రి జ‌న‌వాణి నిర్వ‌హిస్తామ‌న్న నాదెండ్ల‌
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఇటీవ‌లే ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్ బారిన ప‌డ్డార‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌క‌టించారు. ప‌వ‌న్‌తో పాటు ఈ ప‌ర్య‌ట‌న‌లో పాలుపంచుకున్న ప‌లువురు పార్టీ నేత‌లు, ప‌వ‌న్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా వైర‌ల్ ఫీవ‌ర్ సోకింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

ప‌వ‌న్‌కు వైరల్ ఫీవ‌ర్ సోకిన కార‌ణంగా ఈ నెల 24న (ఆదివారం) నిర్వ‌హించ‌నున్న జ‌న‌వాణిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు నాదెండ్ల ప్ర‌క‌టించారు. త‌దుప‌రి జ‌న‌వాణిని ఈ నెల 31న నిర్వ‌హిస్తామ‌ని, ఏ ప్రాంతంలో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. జ‌నం స‌మ‌స్య‌ల‌ను సేక‌రించి ప్ర‌భుత్వానికి పంపేందుకు జ‌న‌వాణి పేరిట జ‌న‌సేన ఇటీవ‌లే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌లో రెండు, భీమ‌వ‌రంలో ఓ జ‌న‌వాణి కార్య‌క్ర‌మం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Janavani

More Telugu News