పన్నీర్ సెల్వంకు మరో షాక్ ఇచ్చిన పళనిస్వామి
- ఇటీవలే పన్నీర్ సెల్వంపై వేటు వేసిన పళనిస్వామి
- ఇప్పుడు ఆయన కుమారులను కూడా సస్పెండ్ చేసిన వైనం
- పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్న పళని
ఈ కారణం వల్లే వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో, పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిపోయాయి. వెంటనే పన్నీర్ సెల్వంను పార్టీ పదవులతో పాటు, సభ్యత్వం నుంచి కూడా తొలగించారు.