బాగానే వెన‌కేశారంటూ.. మంత్రి రోజాపై టీడీపీ సెటైర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాగానే వెన‌కేశారంటూ.. మంత్రి రోజాపై టీడీపీ సెటైర్‌!

tdp satires on ap minister rk roja over benz car purchage
  • రోజా కొత్త కారు వీడియోను పోస్ట్ చేస్తూ టీడీపీ విమ‌ర్శ‌నాస్త్రాలు
  • రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీల‌ను ‌కలెక్షన్ క్వీన్‌లుగా పేర్కొన్న వైనం
  • అపాయింట్‌మెంట్‌ల ద్వారా బాగానే వెన‌కేశారంటూ సెటైర్‌
ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఇటీవ‌లే బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాపై టీడీపీ వ్యంగ్యంగా స్పందించింది. తాజాగా ఆమె కొనుక్కున్న బెంజ్ కారు వీడియోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేసింది.   

'మంత్రి గారికి అపాయింట్మెంట్స్ లో బాగానే వస్తున్నట్టు ఉన్నాయి.. బాగానే వెనకేసారు..' అంటూ రోజా వీడియోపై టీడీపీ కామెంట్ చేసింది. అంతేకాకుండా రోజా కొన్న జీఎల్ఎస్‌- 400డీ బెంజ్ కారు విలువ రూ.1.5 ల‌క్ష‌ల‌ని కూడా టీడీపీ పేర్కొంది. జ‌గ‌న్ కేబినెట్‌లో రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీల‌ను ‌కలెక్షన్ క్వీన్లుగా పేర్కొంటూ ఓ రౌండ్ లోగోను ఆ వీడియోకు అతికించింది. ఈ ఇద్ద‌రు మంత్రులు త‌మ‌తో అపాయింట్ మెంట్ కోసం వ‌స్తున్న వారి వ‌ద్ద రూ.50 వేల చొప్పున వ‌సూలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోప‌ణ‌లు గుప్పించింది.
YSRCP
Roja
TDP
Benz Car

More Telugu News