కలకలం.. మమతా బెనర్జీ ఇంటి వద్ద ఏడు సార్లు రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది!
- ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది
- ఫోన్ లో మమత ఫొటోలు తీసిన వైనం
- 11 సిమ్ కార్డులను వాడిన ఉగ్రవాది
మొల్లాను విచారించిన సమయంలో పలు విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. మొల్లా 11 సిమ్ కార్డులను ఉపయోగించాడని... బంగ్లాదేశ్, బీహార్, ఝార్ఖండ్ లకు ఫోన్లు చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అతనికున్న కార్యకలాపాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని ఈ నెల 18 వరకు కోర్టు పొడిగించింది. సీఎం నివాసం వద్ద ఉగ్రవాది రెక్కీ నేపథ్యంలో... సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ ను పదవి నుంచి తొలగించారు.