‘చైనీస్‌ అని పిలవొద్దు.. మేం భారతీయులం’.. అరుణాచల్‌ చిన్నారి వీడియో వైరల్‌

Arunachal Pradesh girl viral video dont call us Chinese we are Indians
  • అరుణాచల్‌ చిన్నారి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
  • చైనీస్‌ అని పిలవడంపై చిన్నారి అసంతృప్తి
  • ‘‘మమ్మల్ని ఇండియన్స్‌ అని పిలవండి’’ అని విన్నపం
  • తాను ఇటానగర్‌లో నివసిస్తున్నానని తెలిపిన చిన్నారి
  • చిన్నారి ధైర్యంగా స్పందించడంపై నెటిజన్ల ప్రశంసలు
‘‘మేం ఇండియన్స్‌.. చైనీస్‌ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది.. బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్‌ అని పిలవండి’’ అంటూ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తనను చైనీస్‌ అని ప్రశ్నించిన వ్యక్తికి ఆ చిన్నారి ఎంతో స్పష్టంగా సమాధానం ఇచ్చింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న జాతి వివక్షపై మరోసారి చర్చకు దారితీసింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని నువ్వు చైనీస్‌వా? అని అడిగాడు. అందుకు తను ఏమాత్రం తడబడకుండా స్పందించింది. ‘‘మేం భారతీయులం. మమ్మల్ని చైనీస్‌ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది. చాలా బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్‌ అని పిలవండి. మేం ఇండియాకు చెందినవాళ్లం. ఇటానగర్‌లో ఉంటాం’’ అని చెప్పింది.

చిన్న వయసులోనే తనకు ఎదురైన ప్రశ్న తప్పని ఆమె స్పష్టంగా చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది. తన బాధను దాచుకోకుండా, అదే సమయంలో ఎవరినీ దూషించకుండా ఆమె చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. చిన్నారి స్పష్టతను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని చైనీస్‌, నేపాలీ లేదా ఇతర దేశాలకు చెందినవారిగా పొరబడటం ఇప్పటికీ కనిపిస్తోందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల ప్రజల రూపురేఖల ఆధారంగా వారి జాతీయతను ప్రశ్నించడం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘నువ్వు భారతీయురాలివని నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు’’ అంటూ పలువురు ఆ చిన్నారికి మద్దతు తెలిపారు.
Advertisement
Arunachal Pradesh Girl
North East India Racism
Viral Video
Indian Identity
Itanagar
Social Media Viral

More Telugu News