ఇది అందరికీ మోదీగారు ఇచ్చిన బహుమతి: కేటీఆర్ సెటైర్లు

KTS satires on Modi for increasing Gas rate
  • వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచిన కేంద్రం
  • హైదరాబాద్ లో రూ. 1,105కి చేరుకున్న సిలిండర్ ధర
  • అచ్చే దిన్ వచ్చాయన్న కేటీఆర్
వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. 14 కేజీల సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 50 పెంచింది. తాజా పెంపుతో హైదరాబాద్ లో రూ. 1,055గా ఉన్న సిలిండర్ ధర రూ. 1,105కి చేరుకుంది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,053కి చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి విమర్శలు గుప్పించారు. 'మంచి రోజులు (అచ్చే దిన్) వచ్చాయి. అందరికీ శుభాకాంక్షలు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగి... రూ. 1,050 దాటింది. ఇది అందరికీ మోదీ ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. మరోవైపు, గ్యాస్ ధరను మరోసారి పెంచడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
KTR
TRS
Gas Rate
Narendra Modi
BJP

More Telugu News