వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ మృతి.. ఎంతో బాధ కలుగుతోందన్న మోదీ!
- షాపూర్జీ పల్లోంజీ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
- ఆయన వయసు 93 ఏళ్లు
- 1929లో పార్శీ కుటుంబంలో జన్మించిన మిస్త్రీ
- మిస్త్రీని పద్మభూషణ్ తో గౌరవించిన భారత ప్రభుత్వం
- దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఎంతో సేవ చేశారన్న మోదీ
పల్లోంజీ మిస్త్రీ 1929లో గుజరాత్ లోని పార్శీ కుటుంబంలో జన్మించారు. మన దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఎంతో సేవ చేసిన ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూపును 1865లో స్థాపించారు. మన దేశంలో ఉన్న అతి పెద్ద వ్యాపార దిగ్గజాలలో ఈ గ్రూపు కూడా ఒకటి. నిర్మాణం, రియలెస్టేట్, టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, గృహోపకరణాలు, షిప్పింగ్, పబ్లికేషన్స్, పవర్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో ఈ గ్రూపు కార్యకలాపాలు ఉన్నాయి.
టాటా గ్రూపులో అత్యధిక వ్యక్తిగత షేర్ కలిగిన వ్యక్తి పల్లోంజీ మిస్త్రీ కావడం గమనార్హం. టాటా గ్రూపులో 18 శాతానికి పైగా వాటాను ఆయన కలిగి ఉన్నారు. మిస్త్రీ తండ్రి షాపూర్జీ పల్లోంజీ 1930లో టాటా సన్స్ షేర్స్ ను కొనుగోలు చేశారు. మిస్త్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.