నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
- కోర్టు విచారణ కోసం తిరుపతికి వచ్చిన మోహన్ బాబు
- తాను రియల్ హీరోనని చెప్పిన మోహన్ బాబు
- విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని వ్యాఖ్య
2019లో తిరుపతిలో తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన కేసులో కోర్టు విచారణ కోసం ఆయన తిరుపతికి వచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదయింది. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ లపై కూడా కేసు నమోదయింది. కాసేపట్లో తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి మోహన్ బాబు కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.