రాజమండ్రి గామన్ బ్రిడ్జి వద్ద యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం
- మృతురాలు శాంతినగర్‌కు, యువకుడు కోటిలింగాలపేటకు చెందిన వారిగా గుర్తింపు
- ప్రైవేట్ ఆసుపత్రికి యువకుడి తరలింపు
- పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి యువతి మృతదేహం తరలింపు
- హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
రాజమండ్రి శివారు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతో పాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని హుటాహుటిన నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతిని శాంతినగర్‌కు చెందిన నివాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హత్య లేక ఆత్మహత్యాయత్నమా అనే అనుమానాలతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.