జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్ మృతి పట్ల నారా లోకేశ్ సంతాపం

Nara Lokesh pays tributes to journalist Srinivas
  • ఈ తెల్లవారుజామున శ్రీనివాస్ మృతి
  • సంతాపం ప్రకటిస్తున్న మీడియా మిత్రులు
  • శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న లోకేశ్
సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కుమార్ మృతి మీడియా రంగంలో విషాదాన్ని నింపింది. వివిధ సంస్థల్లో పని చేస్తున్న మీడియా మిత్రులు శ్రీనివాస్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. 'సీనియర్ పాత్రికేయులు, సూర్య దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Journalist Srinivas

More Telugu News