టాస్ గెలిచిన ప్రోటీస్‌!... తొలి టీ20లో ఫ‌స్ట్ బ్యాటింగ్ భార‌త్‌దే!

south africa wins the toss and opt to chase
భార‌త్‌లో ద‌క్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ప‌ర్యాట‌క జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా ఆతిథ్య జ‌ట్టు టీమిండియాను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా... ఈ సిరీస్‌తో కెప్టెన్‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌కు మంచి అవ‌కాశం చిక్కింద‌న్న వాద‌న‌లు వినిపించాయి. అయితే గాయం కార‌ణంగా కేఎల్ రాహుల్ మొత్తంగా ఈ సిరీస్‌కే దూరం కాగా... టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు కెప్టెన్సీ ప‌గ్గాలు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సిరీస్‌లో స‌త్తా చాటి టీమిండియాకు భ‌విష్య‌త్తు కెప్టెన్‌గా రిష‌బ్ అవ‌త‌రిస్తాడా? అన్నది చూడాలి! 
Go Back to Shorts
Team India
South Africa
Arun Jaitley Stadium
Rishab Panth

More Telugu News