Ambati Rambabu: ఈ ట్వీట్ ను ఎందుకు తొలగించావో ధైర్యముంటే చెప్పు ఉమ: ప్రశ్నించిన అంబటి

Ambati questions Devineni Uma
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం తెలిసిందే. ఒకరు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి కాగా, మరొకరు ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి. ఇటీవల అంబటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం అంశంలో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

అయితే, తాజాగా దేవినేని ఉమ ఓ ట్వీట్ చేసి వెంటనే తొలగించాడంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ ట్వీట్ పెట్టి, డిలీట్ చేసిన మాట వాస్తవమా, కాదా? ధైర్యముంటే చెప్పు ఉమ అని అంబటి ప్రశ్నించారు. అంతేకాదు, దేవినేని పోస్టు చేసి తొలగించాడంటున్న ట్వీట్ ను కూడా పంచుకున్నారు. 

ఆ ట్వీట్ లో... "ఒక్కచోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళతాను అన్నది అంట" అని పేర్కొన్నారు. ఇటీవల జనసేనాని తన ప్రసంగంలో పొత్తుల అంశంలో మూడు ఆప్షన్లు ఇవ్వడం తెలిసిందే.
Go Back to Shorts
Ambati Rambabu
Devineni Uma
Tweet
YSRCP
TDP

More Telugu News