పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ జీవితంపై పుస్తకాలు... ఆవిష్కరించిన నాగబాబు
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ జీవితంపై పుస్తకాలు... ఆవిష్కరించిన నాగబాబు

Nagababu launches two books on Pawan Kalyan cinema and political career
  • ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు
  • విజయనగరం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
  • పవన్ పై పుస్తకాలు రాసిన సముద్ర గురుప్రసాద్
  • అభినందించిన నాగబాబు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీ నటుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ ప్రస్థానంపై విజయనగరం జిల్లా వాసి సముద్ర గురుప్రసాద్ రాసిన రెండు పుస్తకాలను కూడా నాగబాబు ఆవిష్కరించారు. రచయితకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికారిక ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, జిల్లా నేతలు ఇంటి రాజేశ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గురాన అయ్యాలు తదితరులు పాల్గొన్నారు.
Nagababu
Books
Pawan Kalyan
Vijayanagaram District
Janasena

More Telugu News