CPI Narayana: ప్రజలు బలం ఇచ్చినా ఉపయోగం లేదు... జగన్ కేంద్రానికి బానిసలా మారాడు: సీపీఐ నారాయణ

ఏపీ రాజకీయ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. జగన్ సర్కారు పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోతలా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ప్రజలు ఇచ్చిన బలం ఉపయోగం లేకుండా పోయిందని, కేంద్రానికి జగన్ బానిసలా మారాడని నారాయణ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబంలా నిలిచారని గుర్తుచేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలంతో పనిపడిందని, ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రం నుంచి సాధించుకోవాలని నారాయణ ఏపీ సర్కారుకు హితవు పలికారు.
CPI Narayana
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News