TDP: రాజీనామా ట్వీట్ డిలీట్‌!... టీడీపీని వీడే ప్ర‌సక్తే లేద‌న్న దివ్య‌వాణి!

divyavani delete tweet on resignation to tdp
షార్ట్స్‌లో చూడండి
పార్టీలో గుర్తింపు దక్కడం లేదని పేర్కొంటూ.. తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్న‌ట్లుగా ఈ ఉదయం పోస్ట్ చేసిన ట్వీట్‌ను ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి, సినీ న‌టి దివ్య‌వాణి నిమిషాల వ్య‌వధిలోనే తొల‌గించేశారు. అంతేకాకుండా తాను టీడీపీని వీడే ప్ర‌సక్తే లేదని విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. నేటి సాయంత్రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యం నుండి ఆమె మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జునుడు దివ్య‌వాణితో మాట్లాడిన‌ట్లుగా స‌మాచారం. అర్జునుడితో మాట్లాడిన అనంత‌రం త‌న నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న‌లో ప‌డిన దివ్య‌వాణి... తాను టీడీపీని వీడేది లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా రాజీనామా చేస్తున్న‌ట్లు పోస్ట్ చేసిన ట్వీట్‌ను ఆమె తొల‌గించారు. ఈ సాయంత్రం ఆమె టీడీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేయ‌నున్న మీడియా స‌మావేశంలో దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లుగా స‌మాచారం.
Go Back to Shorts
TDP
Divyavani
Twitter
Bachula Arjunudu

More Telugu News