ముగిసిన విదేశీ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్
- 12 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న కేటీఆర్
- తొలుత లండన్ వెళ్లిన మంత్రి
- 23న దావోస్ చేరుకున్న కేటీఆర్
- 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశం
- రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుడులు
23న దావోస్ సదస్సుకు హాజరయ్యారు. 28 వరకు జరిగిన ఈ సదస్సులో భాగంగా కేటీఆర్ తెలంగాణ పెవిలియన్లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు రూ. 4,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సాధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు.