లడఖ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు జవాన్ల దుర్మరణం!
- టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఆర్మీ వాహనం
- తీవ్రంగా గాయపడ్డ 19 మంది సైనికులు
- గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్సులో తరలింపు
పార్తాపూర్ లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్ లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆర్మీ వాహనంలో 26 మంది సైనికులు ఉన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.