Nizamabad District: బీహార్‌లో బోల్తాపడిన నిజామాబాద్ బస్సు.. ఒకరి మృతి.. కాశీయాత్రకు వెళ్తుండగా ఘటన

Nizamabad bus Over turned in Bihar one dead
షార్ట్స్‌లో చూడండి
నిజామాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ఓ బస్సు బీహార్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 38 మంది యాత్రికులతో నిన్న ఓ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది.

ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన 70 ఏళ్ల సరళమ్మ మృతి చెందింది. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ బస్సులో నిజామాబాద్‌ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు.
Go Back to Shorts
Nizamabad District
Nirmal District
Bihar
Aurangabad
Road Accident

More Telugu News