అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకాభివృద్ధి సూచీలో పతనమైన భారత్ స్థానం
- తాజా సూచీ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- 54వ స్థానంలో నిలిచిన భారత్
- 2019లో భారత్ ర్యాంకు 46
- ఈసారి అగ్రస్థానంలో జపాన్
- టాప్-5లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ
ఈ జాబితా కోసం 117 దేశాల ఆర్థిక, ప్రయాణ, పర్యాటక పరిస్థితులను ప్రామాణికంగా తీసుకున్నారు. ఆయా దేశాల్లో ఆరోగ్య పరిస్థితులు, మౌలిక వసతులు, భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తాజా సూచీలో జపాన్ నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో స్పెయిన్, నాలుగో స్థానంలో ఫ్రాన్స్, ఐదో స్థానంలో జర్మనీ ఉన్నాయి.