ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేంతవరకు మా పోరాటం ఆగదు: చంద్రబాబు
- వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో శవం
- విగతజీవుడిగా మాజీ డ్రైవర్
- కాకినాడ జీజీహెచ్ లో మృతదేహం
- పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో టీడీపీ నేతలపై పోలీసుల వైఖరి దారుణమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ మృతి కేసులో నిజానిజాలు తేలాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రధాన నిందితుడు అనంతబాబును అరెస్ట్ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.