కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల దుర్మరణం!

Helicopter Crash In Chhattisgarh Raipur 2 Pilots Dead
  • ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘోర ప్రమాదం
  • ల్యాండ్ చేస్తుండగా హెలికాప్టర్ లో చెలరేగిన మంటలు
  • ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవలు దుర్మరణం చెందారు. 

ఈ ప్రమాదం గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, నిన్న రాత్రి 9.10 గంటల సమయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారని... ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఇతర ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు. 

అయితే ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై డీజీసీఏ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించాయి. ఈ ప్రమాదం పట్ల ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్లకు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Go Back to Shorts
Chhattisgarh
Helicopter Crash
Pilots
Dead

More Telugu News