'సర్కార్ వారి పాట’ బాగుంది... మహేశ్ సినిమాపై విజయసాయిరెడ్డి ప్రశంసలు
- గురువారం విడుదలైన 'సర్కార్ వారి పాట’
- సినిమాపై ప్రశంసలు కురిపించిన విజయసాయిరెడ్డి
- సమకాలీన అంశాలతో సందేశాత్మకంగా సాగిందని వెల్లడి
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని సదరు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని కూడా సాయిరెడ్డి చిత్రంపై ప్రశంసలు కురిపించారు.