Tollywood: 'ద పీకాక్‌' క‌వ‌ర్‌పేజీపై మ‌హేశ్ బాబు.. మేగ‌జీన్ కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన సూప‌ర్ స్టార్‌

  • ఎస్వీపీ ప్ర‌మోష‌న్స్ బిజీలో మ‌హేశ్ బాబు
  • ద పీకాక్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించిన వైనం
  • మేగ‌జీన్‌, ఆ ప‌త్రిక జ‌ర్న‌లిస్టుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన సూపర్ స్టార్‌
mahesh babu poster on the paecock magazine

స‌ర్కారు వారి పాట చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో  టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 12న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా... సోమ‌వారం 'ద పీకాక్' మేగ‌జీన్ క‌వ‌ర్ పేజీపై మ‌హేశ్ బాబు క‌నిపించి అభిమానుల‌ను ఖుషీ చేశారు. ద పీకాక్ మేగ‌జీన్ క‌వ‌ర్ పేజీపై తాను ఉన్న ఫొటోను స్వ‌యంగా మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

మేగ‌జీన్ క‌వ‌ర్ పేజీపై త‌న ఫొటోను ప్ర‌చురించిన ద పీకాక్ మేగ‌జీన్‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫొటో కోసం జ‌రిగిన షూట్ మొత్తం ఉల్లాసంగా గ‌డిచింద‌ని పేర్కొన్న మ‌హేశ్.. ఆ షూట్ కోసం క‌ష్ట‌ప‌డ్డ ద పీకాక్ మేగ‌జీన్ జ‌ర్న‌లిస్టులు ఫాల్గుణి, షేన్‌ల‌కు కూడా మ‌హేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు. 

More Telugu News